ఏమన్నా మాట్లాడితే జగన్‌కు అనుకూలమంటున్నారు | Talasani comments in telangana assmebly lobby | Sakshi
Sakshi News home page

ఏమన్నా మాట్లాడితే జగన్‌కు అనుకూలమంటున్నారు

Mar 23 2016 1:49 AM | Updated on Aug 10 2018 9:42 PM

ఏమన్నా మాట్లాడితే జగన్‌కు అనుకూలమంటున్నారు - Sakshi

ఏమన్నా మాట్లాడితే జగన్‌కు అనుకూలమంటున్నారు

‘వాస్తవాలు మాట్లాడితే టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. నేనేం మాట్లాడినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.

- అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని ఆసక్తికర వాఖ్యలు

సాక్షి, హైదరాబాద్:
‘వాస్తవాలు మాట్లాడితే టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. నేనేం మాట్లాడినా  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. మీరొకసారి నాతో ఏపీ లాబీల్లోకి వచ్చినా పక్కన నిలబడి గమనించండి. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంత కోపం, ఎంత అసంతృప్తి ఉన్నాయో అర్థమవుతుంది’ అని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఏపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంపై స్పందిస్తూ ‘గోరుతో పోయేదాన్ని.. గొడ్డలి దాకా తెచ్చుకున్నారు’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు తీరు గురించి మాట్లాడితే జగన్‌కు అనుకూలంగా మాట్లాడానని భావిస్తున్నారని, నిజాలు మాట్లాడడానికి ఎవరైతే ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేత ఒకరు దొరికిన దొంగ అని, ఆ నాయకుని గురించి ఎక్కువగా స్పందించదలుచుకోలేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement