అనుమానస్పద స్థితిలో స్వాతంత్ర్య సమరయోధుడు మృతి చెందాడు.
హైదరాబాద్ (దుండిగల్): అనుమానస్పద స్థితిలో స్వాతంత్ర్య సమరయోధుడు మృతి చెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగేంద్ర బాబు కథనం ప్రకారం.. హిమాయత్‌నగర్, హైదర్‌గూడకు చెందిన నాగుళ్ల నర్సింహ(93) స్వాతంత్య్ర సమరయోధుడు. కాగా, ఏడాది క్రితం కుటుంబ సభ్యులు నర్సింహను బౌరంపేటలోని వడ్డేపల్లి నర్సింగ్‌రావు వృద్దాశ్రమంలో చేర్పించారు.
కాగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న నర్సింహ గురువారం ఉదయం 8 గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా విషయం తెలుసుకున్న మృతుడి తనయుడు సత్యనారాయణ అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.