బీజేపీకి మద్దతుకు తొందరెందుకు?: సర్వే | Survey Satyanarayana on kcr | Sakshi
Sakshi News home page

బీజేపీకి మద్దతుకు తొందరెందుకు?: సర్వే

Jun 25 2017 12:55 AM | Updated on Aug 15 2018 9:40 PM

బీజేపీకి మద్దతుకు తొందరెందుకు?: సర్వే - Sakshi

బీజేపీకి మద్దతుకు తొందరెందుకు?: సర్వే

బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎందుకు తొందర పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారా యణ ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎందుకు తొందర పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారా యణ ప్రశ్నించారు. శనివారం గాంధీభ వన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, మీరా కుమార్‌ స్పీకరుగా ఉన్నందుకే తెలంగాణ బిల్లు పాస యిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

‘సీఎం కేసీఆర్‌కు దండం పెట్టి అడుగుతున్నా.. మీరాకుమార్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేయండి’ అని విజ్ఞప్తి చేశారు. దళిత సీఎం మాటను నిలబెట్టుకోనప్పుడే కేసీఆర్‌పై దళిత వ్యతిరేకి ముద్ర పడిందన్నారు. మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారన్నారు. బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కన్నా మీరాకుమార్‌ గొప్ప అభ్యర్థి అ న్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరాకుమార్‌కు ఓటేయలేమని మనస్సాక్షిగా చెప్పగలరా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement