మద్యం మత్తులో విద్యార్థినులు హల్ చల్ చేశారు.
హైదరాబాద్: మద్యం మత్తులో విద్యార్థినులు హల్ చల్ చేశారు. సోమవారం రాత్రి పీకలదాక తాగిన విద్యార్థినులు రోడ్డు పై వెళ్తున్న బైక్ను ఢీకొట్టి ఆపకుండా ముందుకు పోయారు. దీంతో బైక్పై ఉన్న యువకులు కారును వెంబడించి జూబ్లిహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద వారిని అడ్డుకున్నారు.
ఆ సమయానికి మద్యం సేవిస్తున్న గ్లాసులు కూడా కారులోనే ఉన్నాయి. అంతేకాకుండా డోర్లు కూడా తెరవకుండా విద్యార్థినులు కారులోనే ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.