సాంబారు పాత్రలో పడిన విద్యార్థి మృతి | student who fell in sambar dish, died | Sakshi
Sakshi News home page

సాంబారు పాత్రలో పడిన విద్యార్థి మృతి

Dec 24 2016 11:28 AM | Updated on Sep 28 2018 3:41 PM

మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు.

కట్టంగూరు: మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన బల్కూరి జయవర్ధన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు.
 
దీంతో తల, ముఖ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థిని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామస్తుల్లో విషాదం అలుముకుంది.

Advertisement
 
Advertisement
Advertisement