అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు విద్యార్థి వేధింపులు | student harassed by asst professor | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు విద్యార్థి వేధింపులు

Feb 6 2016 11:55 PM | Updated on Nov 9 2018 5:02 PM

మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

హైదరాబాద్ :  మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం వివరాల ప్రకారం... ఎల్‌బీనగర్ సాగర్‌ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న యువతి (26)  మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

అదే కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రవితేజ అనే విద్యార్థి గత కొన్ని రోజులుగా ఆమె వెంట పడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె శనివారం ఎల్‌బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement