హైటెక్ మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థి | Student booked for High-tech mass copying | Sakshi
Sakshi News home page

హైటెక్ మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థి

May 6 2016 5:07 PM | Updated on Sep 3 2017 11:32 PM

చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఓ విద్యార్థి స్క్వాడ్‌కు దొరికాడు.

హైదరాబాద్‌ : చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఓ విద్యార్థి స్క్వాడ్‌కు దొరికాడు. పట్టుబడిన విద్యార్థి షేక్ వసీం అహ్మద్.. నవాబ్ షా ఆలం ఖాన్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. లోదుస్తుల్లో మొబైల్‌ను, బనియన్‌లో ట్రాన్స్‌మీటర్‌లను అమర్చి, చిన్న పరిమాణంలో బ్లూటూత్ పరికరాన్ని చెవిలో పెట్టుకుని ఆన్‌లైన్‌లో పరీక్ష రాస్తుండగా స్క్వాడ్ పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement