సికింద్రాబాద్-విశాఖ మధ్య సువిధ రైళ్లు | Special trains Between Secunderabad-Visakhapatnam | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్-విశాఖ మధ్య సువిధ రైళ్లు

Jun 23 2016 4:11 AM | Updated on Sep 4 2017 3:08 AM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-విశాఖల మధ్య సువిధ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రయాణికుల రద్దీ రీత్యా ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ. రైల్వే
 
 సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-విశాఖల మధ్య సువిధ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ-సికింద్రాబాద్ (08501/08502) వీక్లీ సువిధ ట్రైన్ జూలై 5, 12, 19, 26, ఆగస్టు 2, 9, 23, 30 తేదీల్లో విశాఖ నుంచి రాత్రి 11 గంటలకు  బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో జూలై 6, 13, 20, 27, ఆగస్టు 3, 10, 24, 31 తేదీల్లో సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 కి విశాఖ చేరుకుంటుంది.

  విశాఖ-తిరుపతి (08573 / 08574) సువిధ ట్రైన్ జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 29 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 5, 12, 19, 26 ఆగస్టు 2, 9, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.30 కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 కి విశాఖ చేరుకుంటుంది.

  కాచిగూడ-టాటానగర్ (07438/ 07439) స్పెషల్ ట్రైన్ జూలై 4, 11, 18, 25 తేదీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు 5 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.50  గంటలకు టాటానగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

  సికింద్రాబాద్-గౌహతి (07149/ 07150) స్పెషల్ ట్రైన్ జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో (శుక్రవారాల్లో) ఉదయం 7.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 కు గౌహతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 4, 11, 18, 25 ఆగస్టు 1 (సోమవారాల్లో) ఉదయం 6.15 కు గౌహతిలో బయలుదేరి బుధవారం ఉదయం 9.15 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  హైదరాబాద్-కొచ్చువెలి (07115 /   07116) స్పెషల్ ట్రైన్ జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండవ రోజు తెల్లవారుజామున 3.20కి కొచ్చువెలి చేరుకుంటుంది. జూలై 4, 11, 18, 25 ఆగస్టు 1 తేదీల్లో రాత్రి 8.15కి కొచ్చువెలిలో బయలుదేరి 2వ రోజు తెల్లవారు జామున 3.30కి నాంపల్లి చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement