'హెల్మెట్ నిబంధనపై మినహాయింపు ఇవ్వండి' | Sikhs want exemption from wearing helmets | Sakshi
Sakshi News home page

'హెల్మెట్ నిబంధనపై మినహాయింపు ఇవ్వండి'

Jun 10 2016 8:23 PM | Updated on Sep 4 2017 2:10 AM

ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన నుంచి సిక్కులకు మినహాయింపు ఇవ్వాలంటూ సిక్కు అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. ట్రాఫిక్ చీఫ్ జితేందర్‌ను కోరింది.

హైదరాబాద్ : ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన నుంచి సిక్కులకు మినహాయింపు ఇవ్వాలంటూ సిక్కు అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. ట్రాఫిక్ చీఫ్ జితేందర్‌ను కోరింది. శుక్రవారం ట్రాఫిక్ కమిషనరేట్‌లో ఆయన్ను కలిసిన అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రతినిధులు ఎస్.జస్పాల్ సింగ్, కొండారెడ్డి, తిరుపతి వర్మ, చింతల కృష్ణ, హర్మేంద్ర సింగ్, గుర్నమ్ సింగ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం సిక్కులకు హెల్మెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటూ జితేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలయ్యేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement