దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు | short film director kaushik babu threatened, he complaints police | Sakshi
Sakshi News home page

దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Mar 14 2017 5:22 PM | Updated on Sep 5 2017 6:04 AM

దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

సీత ఐయామ్ నాట్ వర్జిన్ షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబు.. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్: సీత ఐయామ్ నాట్ వర్జిన్ షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబు.. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని సీసీఎస్ డీసీపీ మహంతికి ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు.

సీత ఐయామ్ నాట్ వర్జిన్ టైటిల్ విషయంలో వివాదం ఏర్పడింది. హిందువులకు పూజనీయురాలైన సీతాదేవి పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చేలా, టైటిల్‌ పెట్టారని మేడ్చల్‌ జిల్లా బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ వి.ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత నీరజ్‌నాయుడు, దర్శకుడు కైశిక్ బాబులతో పాటు నటీనటులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement