హోటల్‌ వద్దట..నైట్‌ షెల్టరే ముద్దట! | Shelter in GHMC Night Shelter is too good says American dude | Sakshi
Sakshi News home page

హోటల్‌ వద్దట..నైట్‌ షెల్టరే ముద్దట!

Jun 14 2017 12:19 AM | Updated on Aug 24 2018 8:18 PM

హోటల్‌ వద్దట..నైట్‌ షెల్టరే ముద్దట! - Sakshi

హోటల్‌ వద్దట..నైట్‌ షెల్టరే ముద్దట!

‘హోటళ్లు వద్దు.. నైట్‌షెల్టరే బాగుంది. ఇక్కడే విభిన్న వర్గాలకు చెందిన, వివిధ రకాల మనుషుల్ని కలుసుకునే అవకాశం కలుగుతోంది’

- జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న అమెరికా వాసి వ్యాఖ్య
- ఎమర్జెన్సీ పాస్‌పోర్టును అందజేసిన అమెరికన్‌ కాన్సులేట్‌  
 
సాక్షి, హైదరాబాద్‌: ‘హోటళ్లు వద్దు.. నైట్‌షెల్టరే బాగుంది. ఇక్కడే విభిన్న వర్గాలకు చెందిన, వివిధ రకాల మనుషుల్ని కలుసుకునే అవకాశం కలుగుతోంది’ అని వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్‌లో ఆశ్రయం పొందుతు న్న అమెరికా వాసి ఫ్రీజెన్‌ జాన్‌ మా ర్విన్‌ వ్యాఖ్యానించారు. ఈనెల 6న రైలులో ప్రయాణిస్తుండగా అతడి పాస్‌పోర్టు, వీసా తదితరమైనవి ఉన్న బ్యాగ్‌ను దొంగిలించడంతో ఆరోజు రాత్రి బేగంపేటలోని జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్‌ను ఆశ్రయించారు. అతడి గురించి తెలుసుకున్న పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అవసరమైన సహాయ సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక అమెరికా కాన్సులేట్‌ అధికారులతో మాట్లాడి ఎమర్జెన్సీ పాస్‌పోర్టు వచ్చేలా కృషి చేశారు. స్థానిక అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు మంగళవారం జాన్‌కు పాస్‌పోర్టు అందజేసినట్లు నైట్‌షెల్టర్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఈఎస్‌(శ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీ) ప్రతినిధి జయశ్రీ తెలిపారు. వీసా కూడా వస్తే నేపాల్‌ వెళ్తానని జాన్‌ తెలిపారు. నగరంలో ఏ హోటల్‌లో ఉండాలనుకుంటే అక్కడ ఉండవచ్చునని బుర్రా తెలిపినప్పటికీ జాన్‌ నైట్‌షెల్టర్‌లోనే ఉంటున్నారు. షెల్టర్లో ఉండటమే తనకు సంతోషంగా ఉందని, తగిన రక్షణగా ఉందని చెప్పారు. భారతీయ భాషలు నేర్చుకునేందుకు, ఇక్కడి సాహిత్యం, స్నేహసంబంధాలు తదితరమైనవి అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement