పేకాట శిబిరంపైదాడి: ఏడుగురి అరెస్ట్ | seven arrested in betting case | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపైదాడి: ఏడుగురి అరెస్ట్

Jun 10 2015 6:50 PM | Updated on Sep 3 2017 3:31 AM

పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

గోల్నాక (హైదరాబాద్): పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ఎంసీహెచ్ కాలనీ, క్వార్టర్ నంబర్ 17లో ఇమ్రాన్‌అలీ అనే వ్యక్తి పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 1.15 గంటల సమయంలో ఇమ్రాన్‌అలీ మరో ఆరుగురితో కలసి మూడు ముక్కలాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేసి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,100, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement