నేటి నుంచి రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ | Second stage web counseling from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌

Aug 12 2017 2:26 AM | Updated on Aug 31 2018 8:34 PM

రాష్ట్రంలోని అన్ని వైద్యవిద్య కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ కోసం రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని వైద్యవిద్య కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ కోసం రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలిదశ కౌన్సెలింగ్‌ తర్వాత ఎంబీ బీఎస్‌లో 216, బీడీఎస్‌లో 219 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.

ఇక వైద్య సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు ఇటీవలి తీర్పు ప్రకారం.. తొలిదశ కౌన్సెలింగ్‌లో మైనారిటీ కాలేజీల్లోని బీ కేటగిరీ సీటు పొంది, అడ్మిషన్‌ తీసుకోకుండా ఖాళీగా ఉంటే.. ఆ సీట్లను తాజా కౌన్సెలింగ్‌లో ఏ కేటగిరీలోకి మార్చుతున్నట్లు తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement