సతీశ్‌రెడ్డికి ఇంజనీరింగ్‌ ఎక్సలెన్సీ అవార్డు | sathishreddy got Engineering Excellence Awards | Sakshi
Sakshi News home page

సతీశ్‌రెడ్డికి ఇంజనీరింగ్‌ ఎక్సలెన్సీ అవార్డు

Aug 25 2016 1:44 AM | Updated on Sep 4 2017 10:43 AM

దేశ రక్షణలో కీలకమైన క్షిపణి, ఏరోస్పేస్‌ రంగా ల్లో విశిష్ట సేవల కు గుర్తింపుగా..

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణలో కీలకమైన క్షిపణి, ఏరోస్పేస్‌ రంగా ల్లో విశిష్ట సేవల కు గుర్తింపుగా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీవో క్షిప ణి, వ్యూహాత్మక వ్యవస్థల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ఐఈఐ–ఐఈఈఈ ఇంజనీరింగ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు దక్కింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఐఈఈఈ ఆసియా పసిఫిక్‌ విభాగం స్వరో్ణత్సవాల్లో ఐఈఈఈ అధ్యక్షుడు డాక్టర్‌ బారీ ఎల్‌. షూప్‌ సమక్షంలో ఇస్రో చైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ చేతుల మీదుగా సతీశ్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రం గంలో మరీ ముఖ్యంగా క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల విషయంలో భారత్‌ స్వావలంబన దిశగా వేగం గా  ముందడుగు వేస్తోందన్నారు. దేశ తక్షణ అవసరాలను, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement