సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు | Sakshi Excellence awards conferred in JRC convention centre | Sakshi
Sakshi News home page

సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

May 14 2017 7:14 PM | Updated on Aug 20 2018 8:20 PM

సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు - Sakshi

సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌: సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్‌ జర్నలిస్టు బర్ఖాదత్‌, సాక్షి గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతిరెడ్డి, ఈడీ రామచంద్రమూర్తిలు హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రధానం చేశారు. అమరవీరుడు వెంకరమణకు పోస్ట్‌ హ్యూమస్‌ అవార్డు ప్రకటించగా.. ఆయన సోదరుడు కోటేశ్వరరావు అవార్డును అందుకున్నారు.

వరంగల్‌లో సహృదయ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న యాకుబ్‌ బీకు సామాజిక సేవ అవార్డును అందుకున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి యాకుబ్‌ బీకు అవార్డు అందజేశారు. హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు తరఫున ఐపీఎల్‌లో పాల్గొంటున్న మహ్మద్‌ సిరాజ్‌ యంగ్‌ అచీవర్‌ స్పోర్ట్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సోదరుడు సిరాజ్‌ తరఫున అవార్డును అందుకున్నారు.

యంగ్‌ అచీవర్‌ అవార్డును జేఈఈ మెయిన్స్‌లో టాపర్‌గా నిలిచిన మోహన్‌ అభ్యాస్‌ అందుకున్నాడు. టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేనికి యంగ్‌ అచీవర్‌ స్పోర్ట్స్‌ అవార్డును జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి అందించారు. యంగ్‌ అచీవర్‌ స్పోర్ట్స్‌ ఫిమేల్‌ అవార్డును ఆమె తల్లిదండ్రులు హారిక తరఫున అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement