రుణాలకు రూ.1200 కోట్లు కేటాయించాలి- కృష్ణయ్య | Rs .1200 crore has been allocated for the loans | Sakshi
Sakshi News home page

రుణాలకు రూ.1200 కోట్లు కేటాయించాలి- కృష్ణయ్య

Jan 28 2016 8:27 PM | Updated on Sep 3 2017 4:29 PM

బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాల మంజూరు చేసేందుకు బడ్జెట్‌లో అదనంగా రూ.1200 కోట్లు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు.

బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాల మంజూరు చేసేందుకు బడ్జెట్‌లో అదనంగా రూ.1200 కోట్లు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు. ఈ ఏడాది బీసీ కార్పొరేషన్ రుణాలకోసం 1.31.376 దరఖాస్తులు వచ్చాయని, అయితే ప్రభుత్వం కేటాయించిన రూ.125 కోట్ల బడ్జెట్‌తో కేవలం 14 వేలమందికే రుణాలు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు.
ఈ రుణాల మంజూరు కోసం లబ్దిదారుల మధ్య తీవ్రమైన పోటీ ఉందన్నారు. గురువారం సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ మిగిలిపోయిన 1.17 లక్షల మందికి అదనంగా రుణాలు మంజూరు చేయడానికి రూ.1200 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు 2016-17 బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. 2014-15లో, అంతకుముందు బ్యాచ్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి, మొత్తం రుణాల మంజూరుకు రూ.400 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement