సూత్రధారులకు ప్రభుత్వం అండ: రేవంత్‌ | Revant Reddy on Miyapur land scam | Sakshi
Sakshi News home page

సూత్రధారులకు ప్రభుత్వం అండ: రేవంత్‌

Jun 6 2017 1:43 AM | Updated on Sep 5 2017 12:53 PM

సూత్రధారులకు ప్రభుత్వం అండ: రేవంత్‌

సూత్రధారులకు ప్రభుత్వం అండ: రేవంత్‌

వేల కోట్ల మియాపూర్‌ భూ కుంభకోణంలో సూత్రధారులకు, పాత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని

హైదరాబాద్‌: వేల కోట్ల మియాపూర్‌ భూ కుంభకోణంలో సూత్రధారులకు, పాత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూ కుంభకోణం వెలుగు చూసి వారం గడుస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

సోమవారం టీటీడీపీ నేతలు హైదరాబాద్‌లోని మియాపూర్‌ భూముల్లో పర్యటించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సంస్థ యాజ మాని బంధువు ఒకరు సీఎం ఆఫీసులో పనిచేస్తున్నట్లు తెలిసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. వారందరినీ వెలికితీయడానికి సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement