జీవితా రాజశేఖర్కు ఊరట | Sakshi
Sakshi News home page

జీవితా రాజశేఖర్కు ఊరట

Published Sat, Nov 28 2015 1:02 PM

జీవితా రాజశేఖర్కు ఊరట - Sakshi

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్సు కేసును ఎర్రమంజిల్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ తనను కోర్టుకు లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్‌లు తీసుకుని, కేసులో ఇరికించారని  ఆరోపించారు. తనపై కేసు కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు.

కాగా జీవితా రాజశేఖర్ 2007లో 'ఎవడైతే నాకేంటి' అనే సినిమా నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా  అతడికి ఇచ్చిన చెక్‌ బౌన్స్ కావటంతో కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014లో జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతరం ఆమె బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై సామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... జీవితా రాజశేఖర్పై  హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు.

Advertisement
Advertisement