తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు హెల్త్ స్కీంతో పాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు హెల్త్ స్కీంతో పాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవో ఒకటి జారీ అయింది. ఈ ఏడాది చివరి వరకు ఈ రెండు పథకాలు సమాంతరంగా అమలు కానున్నాయి. వాస్తవానికి ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలుచేసిన తర్వాత ఇక రీయింబర్స్‌మెంట్ ఇవ్వకూడదని తొలుత భావించారు.
కానీ, కొన్ని ఆస్పత్రులు ఇంకా ఈహెచ్ఎస్ పథకం పరిధిలోకి రాకపోవడంతో, ఉన్న ఆస్పత్రులలో ఈహెచ్ఎస్ పథకాన్ని అమలుచేయడంతో పాటు, అదే సమయంలో రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30 వరకే ఈ రెండు అమలులో ఉండేలా ఇంతకుముందు ఉత్తర్వులిచ్చారు. అయితే సమస్య ఇంకా పరిష్కారం కానందున 2016 డిసెంబర్ 31 వరకు రీయింబర్స్‌మెంట్‌ను కూడా కొనసాగించేలా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.