రొమాంటిక్ రికార్డ్! | Record romantic! | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ రికార్డ్!

Jan 13 2015 11:46 PM | Updated on Sep 2 2017 7:39 PM

రొమాంటిక్ రికార్డ్!

రొమాంటిక్ రికార్డ్!

ఎప్పుడొచ్చామన్నది కాదు.. ‘బుల్లెట్’ దిగిందా లేదా అన్నదే పాయింట్! ఇరవై రెండేళ్ల కిందట రిలీజైన ‘బేసిక్ ఇన్‌స్టెంట్’ పిక్చరూ అంతే! అప్పుడెప్పుడో వచ్చిందన్నది కాదు...

ఎప్పుడొచ్చామన్నది కాదు.. ‘బుల్లెట్’ దిగిందా లేదా అన్నదే పాయింట్! ఇరవై రెండేళ్ల కిందట రిలీజైన ‘బేసిక్ ఇన్‌స్టెంట్’ పిక్చరూ అంతే! అప్పుడెప్పుడో వచ్చిందన్నది కాదు... దాన్ని తలదన్నే ‘రొమాన్స్’ఇంకే సినిమాలోనన్నా పండిందా లేదా అన్నదే టాపిక్. అలనాటి ‘కలల’ రాణి షెరాన్‌స్టోన్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ తాజాగా ఓ సరికొత్త క్రెడిట్ దక్కించుకుంది.

శృంగారభరిత చిత్రాల్లో ఆల్‌టైమ్ బెస్ట్‌గా రికార్డులకెక్కింది. దీనికి ముందు... తరువాత.. కుప్పలుతెప్పలుగా రొమాంటిక్ చిత్రాలు వచ్చినా... అవేవీ షెరాన్‌స్టోన్ మెస్మరిజాన్ని జయించలేకపోయాయి. డైలీస్టార్ నిర్వహించిన పోల్‌లో ‘పరిమితి లేని’ షెరాన్ నటనా విన్యాసానికి ఓటర్లు దాసోహం అన్నారు. ‘9 1/2 వీక్స్’ చిత్రం రెండో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement