రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టాం! | railway station has been bombed! | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టాం!

Apr 15 2016 12:23 AM | Updated on Sep 3 2017 9:55 PM

రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టాం!

రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టాం!

‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టాం.. మరి కొద్ది సేపట్లో పేలుతుంది. జాగ్రత్త’’...

ఆకతాయి ఫోన్‌కాల్  పోలీసులు ఉరుకులు, పరుగులు

 
సికింద్రాబాద్: ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టాం.. మరి కొద్ది సేపట్లో పేలుతుంది.  జాగ్రత్త’’... అంటూ...ఫోన్ చేసి ఓ ఆకతా యి పోలీసుల ను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. వివరాలు... గురువారం మధ్యాహ్నం 2.30కి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టామని, కొద్దిసేట్లో పేలుపోతుందని హెచ్చరించాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది సమాచారం మేరకు అప్రమత్తమైన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రైల్వేస్టేషన్‌లో తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్‌ఫామ్‌లు, వెయిటింగ్ హాళ్లు, స్టేషన్ పరిసరాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు.


ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఎవరో అకాతాయి ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపం నుంచే ఈ కాల్ వచ్చిందని, సదరు ఫోన్‌మాత్రం రాజేంద్రనగర్‌కు చెందిన నరేష్‌దని గుర్తించారు. చిరునామా అధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు జీఆర్‌పీ బృందాలు బయలుదేరాయి. కాగా, సదరు ఆకతాయిని పోలీసులు గురువారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement