బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించండి | R. Krishnaiah letter to the Prime Minister | Sakshi
Sakshi News home page

బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించండి

Apr 4 2018 3:13 AM | Updated on Apr 4 2018 3:13 AM

R. Krishnaiah letter to the Prime Minister - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీలకు సామాజిక రక్షణ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, సామాజిక పథకాలు చేరవేసే బీసీ కమిషన్‌ బిల్లును నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ప్రతిపక్షాల అభ్యంతరాలతో సెలెక్ట్‌ కమిటీకి పంపారన్నారు. ఆ కమిటీ బిల్లును మళ్లీ పార్లమెంటుకు పంపిందన్నారు. సమావేశాలు ముగియడానికి రెండు రోజులే ఉన్నందున పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కృష్ణయ్య లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement