బాబు పెంచితే సబబు .. కేసీఆర్‌ది కుంభకోణమా? | Private Medical Colleges takes on tdp leaders | Sakshi
Sakshi News home page

బాబు పెంచితే సబబు .. కేసీఆర్‌ది కుంభకోణమా?

Aug 31 2014 12:40 AM | Updated on Sep 2 2017 12:38 PM

మెడికల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ సీట్ల ఫీజు పెంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.వంద కోట్ల ముడుపులు ముట్టాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను..

 టీడీపీ నేతలపై ప్రైవేటు మెడికల్ కాలేజీల ధ్వజం

సాక్షి, హైదరాబాద్: మెడికల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ సీట్ల ఫీజు పెంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.వంద కోట్ల ముడుపులు ముట్టాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తెలంగాణ మెడికల్, డెంటల్ కళాశాలల యాజమాన్యాలు తీవ్రంగా ఖండించాయి. చంద్రబాబు హయాంలోనే ప్రైవేటు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని, ఎన్ని రూ.కోట్ల ముడుపులు తీసుకుని నాడు అనుమతి ఇచ్చారని యాజమాన్య ప్రతినిధులు ప్రశ్నించారు. 

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం తెలంగాణ మెడికల్, డెంటల్ కళాశాలల యాజమాన్యాల సంఘం  అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనరసింహరావు, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ ఇతర ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. నిరాధార ఆరోపణలను మానుకోనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement