ప్రత్తిపాటి, ఆలపాటి క్షమాపణ చెప్పాలి | Prattipati, alapati should apologizes | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాటి, ఆలపాటి క్షమాపణ చెప్పాలి

Feb 10 2016 2:36 AM | Updated on Mar 28 2019 5:35 PM

తమపై అనుచిత వ్యాఖ్యలను అనుమతించినందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజాలు క్షమాపణ చెప్పాలని ఏపీ కాపునాడు డిమాండ్ చేసింది.

ఏపీ కాపునాడు మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: తమపై అనుచిత వ్యాఖ్యలను అనుమతించినందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజాలు క్షమాపణ చెప్పాలని ఏపీ కాపునాడు డిమాండ్ చేసింది. ఎవరి కులాన్ని వారు కీర్తించుకోవడంలో తప్పు లేదని, ఇతరులపై విద్వేషం వెళ్లగక్కడమే ఆక్షేపణనీయమని పేర్కొంది.

గుంటూరు జిల్లాలో ఇటీవల పరిటాల రవి, ఎన్టీఆర్ వర్థంతి సభకు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారని, వారి సమక్షంలో కాపులను కించపరిచేలా ఓ వక్త అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో తమ జాతిని అవమానించేలా ఉందని కాపునాడు రాష్ట్ర నేతలు కె.అప్పారావు, ఆర్.చైతన్య, గడ్డం కోటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement