పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ వెల్లడించారు.
	హైదరాబాద్: పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ వెల్లడించారు. విధుల్లో 1500 మంది పోలీసులను మోహరించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు.  శుక్రవారం ఉదయం7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
