అధికారులపై మంత్రి పోచారం ఆగ్రహం | pocharam srinivas reddy takes on horticulture officers | Sakshi
Sakshi News home page

అధికారులపై మంత్రి పోచారం ఆగ్రహం

Feb 13 2016 11:15 AM | Updated on Sep 3 2017 5:34 PM

ఉద్యానవనశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ : ఉద్యానవనశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హౌస్, పాలి హౌజ్ టార్గెట్లను పూర్తి చేయడంలో విఫలమయ్యారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యానవన శాఖ అధికారులపై చర్యలకు తీసుకుంటామన్నారు. అందులో ఎలాంటి వెనకడుగు వేసే ప్రస్తక్తి లేదని ఉన్నతాధికారులకు పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement