మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై చెయ్యి వేయడంతో అక్కడి స్థానికులు చైన్‌స్నాచర్ అని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పంజగుట్ట: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై చెయ్యి వేయడంతో అక్కడి స్థానికులు చైన్‌స్నాచర్ అని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన వినోద్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి శనివారం రాత్రి సుమారు 8:15 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్ సీ వద్ద వాహనం ఆపుకుని నిలబడ్డాడు. రోడ్డుపై అటుగా వెళుతున్న ఓ యువతిని చేయిపట్టుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.
అక్కడే ఉన్న కొందరు స్థానికులు చైన్‌స్నాచింగ్ చేసేందుకు యత్నించాడనుకుని, అతడిని చితకబాదారు. అనంతరం పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని మద్యం లెవల్ తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా, వినోద్‌పై బాధిత యువతి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయింది.