చిన్న చిత్రం... పెద్ద ప్రమోషన్

చిన్న చిత్రం... పెద్ద ప్రమోషన్


ఆక్టోపస్ స్టూడియోస్. షార్ట్ ఫిలిం ప్రమోషనే దాని లక్ష్యం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. స్క్రీనింగ్, ఆన్‌లైన్ ప్రమోషన్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్స్‌కు చిన్న సినిమాలను పంపించి ప్రమోట్ చేస్తోంది. ఆక్టోపస్ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రాహుల్‌రెడ్డి మాటల్లో...

 

షార్ట్ ఫిలింస్‌కి క్రేజ్ చాలా ఉంది. కానీ, వాటి స్క్రీనింగ్, ప్రమోషన్‌కి ఆర్గనైజ్‌డ్ స్థలం లేదు. ఈవెంట్స్, ఫెస్టివల్స్ ఫలానా టైమ్‌కి జరుగుతాయనే సమాచారం ఉండదు. ఈ ఇబ్బందులన్నీ గుర్తించి ఆక్టోపస్ స్టూడియోస్‌ని 2010లో ప్రారంభించాం. ఇప్పటివరకు 100 పైగా ఫిలిం మేకర్స్‌కు అవకాశం లభించింది. తణికెళ్ల భరణి, నగేష్ కుకునూర్ వంటి వాళ్లతో జ్యూరీ ఏర్పాటు చేశాం. వచ్చిన సినిమాల్లోంచి స్క్రీనింగ్‌కి ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ కోసం యూకే, యూఎస్ నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయి.  స్క్రీనింగ్స్ ద్వారా సినిమా అవకాశాలు వచ్చినవాళ్లూ ఉన్నారు. హుస్సేన్ షా, ప్రదీప్ అద్వైతమ్ తదితరులంతా ఇక్కడి నుంచే

 కెరీర్ మొదలు పెట్టారు.

 

 కలవాలంటే..

 నాకు (rahul@octopusgroup.in) మెయిల్ చేస్తే సరిపోతుంది. సినిమా బాగుంటే ఆక్టోపస్ ఆన్‌లైన్ చానల్ , ఫెస్‌బుక్ పేజీ ద్వారా ప్రమోట్ చేస్తాం. మేకర్ అంగీకారంతో వాటిని కాంపిటీషన్స్‌కి, షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్‌కి కూడా పంపిస్తాం. ఆక్టోపస్‌లో మేం 8 ఫిలింస్ ప్రొడ్యూస్ చేశాం. జర్మనీ, టొరంటో, ఆస్ట్రేలియా, లాస్ ఏంజిలిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యాయి. భవిష్యత్తులో ఆక్టోపస్‌ను ఇండియాలోని ఇతర నగరాలకు విస్తరించాలని అనుకుంటున్నాం.

 

 టచ్ చేశాడు

 ‘చిన్న చిత్రం’ హరీష్ నాగరాజు జీవితాన్ని పెద్ద వులుపే తిప్పింది. ఫార్మసీ డిగ్రీ చేత పట్టిన ఇతడిని అనూహ్యంగా సినీ పరిశ్రవులో స్థిరపడేలా చేసింది. అతడు నటించిన తొలి లఘు చిత్రం ‘టచ్ చేశాడు’ యుూట్యూబ్‌లో పదకొండు లక్షల హిట్స్ సంపాదించింది. దెబ్బకు వునోడి కెరీర్‌కు సిల్వర్ స్క్రీన్ ‘టచ్’ ఇచ్చేసింది. కట్ చేస్తే... ప్రస్తుతం ప్రవుుఖ చిత్రాలకు రైటర్‌గా, నటుడిగా వూంచి జోష్ మీదున్నాడీ కుర్రాడు. సినీ రంగంలో తన ‘షార్ట్’ జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు...   

 

 సొంతూరు గుంటూరు. చెన్నైలో బిఫార్మసీ చేశా. మొదటి నుంచీ డ్యాన్స్‌పై వుంచి పట్టు ఉంది. కాలేజీ డేస్‌లో కల్చర్ ప్రోగ్రామ్స్‌లో భాగస్వావ్యుం. చిన్న చిన్న కవితలు, పాటలు రాసి ఫ్రెండ్స్‌కు వినిపించేవాడిని. కాలేజీ ఫంక్షన్లలో పాడేవాడిని. 2011లో వూటల రచరుుత వెన్నెలకంటి వద్ద వూటలు, రచనలో మెళకువలు నేర్చుకున్నా. అప్పుడే జెమినీ టీవీలో ‘దవుు్మంటే చెప్పేసెయ్’ కార్యక్రవుం యూంకర్‌గా అవకాశం వచ్చింది. లఘు చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. అదే సవుయుంలో సన్నిహితులు నిర్మిస్తున్న ‘టచ్ చేశాడు’లో నటించే అవకాశం వచ్చింది. దీనికి అనూహ్యంగా 11 లక్షల హిట్స్ వచ్చారుు. ఇక అక్కడి నుంచి కెరీర్ కొత్త వులుపు తిరిగింది. ఓ పక్క రచనా సహకారం అందిస్తూనే... బిల్లా రంగా, హమ్ తుమ్ వంటి సినివూల్లో నటించా. ప్రస్తుతం ఎంఎస్ నారాయుణ కువూర్తె దర్శకత్వంలో వస్తున్న ‘సాహెబ్ సుబ్రహ్మణ్యం’లో ప్రధాన పాత్ర చేస్తున్నా.

 

 ఏ నిమిషానికి ఏమి జరుగునో...

 ఒకసారి మంచి జరిగిందని ప్రతిసారీ మంచే జరగదు. అలాగని ఒకసారి చెడు జరిగితే ప్రతిసారీ చెడే జరగదు. కాల మహిమ, పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటాయో చెప్పేందుకు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ షార్ట్ మూవీని దర్శకుడు, రచయిత వసంత్ మజ్జి తెరకెక్కించారు.

 

 దోస్త్ మేరా దోస్త్

చిన్ననాటి మోజు ఈ చిన్నోడిని సినివూ రంగం వైపు నడిపించింది.  ‘పొట్టి సినివూ’తో మొదలైన ప్రయూణం ఇప్పుడు ‘బిగ్ స్క్రీన్’కు చేరింది. ‘దోస్త్ మేరా దోస్త్’... ఇదీ ఇతగాడు తీయుబోయే చిత్రం. సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్న ఈ కుర్రాడు నిఖిలేష్ గోతాని... తన ప్రయూణంలోని వుుఖ్యమైన వుజిలీలను ‘సిటీ ప్లస్’ వుుందుంచాడు...

 

 సినివూ తీయుడవుంటే వూవుూలు విషయువూ! అంత వ్యయుం వునం భరించలేం. అందుకే విరాళాలు సేకరించాలనుకున్నా. ‘దోస్త్ మేరా దోస్త్’ సినివూ కోసం ‘థౌజండ్ ప్రొడ్యూసర్స్.కామ్’ ప్రారంభించా. ప్రతి జిల్లాలో వెయ్యిమంది నుంచి డొనేషన్స్ సేకరించేలా ప్లాన్ చేశాం. స్నేహితుల సహకారంతో డోర్ టు డోర్ తిరిగాం. కొందరు కాదన్నారు.. వురికొందరు చేయుూతనందించారు. మిగిలింది ఫ్రెండ్సందరం షేర్ చేసుకొంటున్నాం. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డెరైక్షన్, డైలాగ్స్, లిరిక్స్ నావే. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఇతివృత్తంతో కథ రాశా. ఫ్రెండ్స్, ప్రేవు చుట్టూ కథ తిరుగుతుంది. పొట్టిశ్రీరావుులు తెలుగు యుూనివర్సిటీ నుంచి తెరకెక్కుతున్న తొలి చిత్రం వూదే. వూ సొంతూరు ఆదిలాబాద్.. వచ్చే నెల అక్కడే షూటింగ్ ప్రారంభిస్తాం.

 

 అలా మొదలైంది...

 వుూవీలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అప్పుడప్పుడూ పాటలు రాస్తూ, డ్రావూలు వేసేవాడిని. ఎంఎస్‌సీ చేశా. రెండేళ్లపాటు తోగాని టెక్నాలజీస్ నడిపించా. సినివూల మీదున్న ఆసక్తితో దాన్ని వదిలేసి తెలుగు వర్సిటీలో ఫిల్మ్ డెరైక్షన్ పీజీ డిప్లవూలో చేరా. ఇక్కడ నేను తీసిన ‘వురో వూసం’ షార్ట్ ఫిల్మ్‌కు వుంచి స్పందన వచ్చింది. ఆ తరువాత ‘నేషనల్ సెల్యూట్’ తీశా. ఆగస్టు 15న టైస్టు వేసుకున్న బాంబు బ్లాస్ట్ ప్లాన్‌ను వికలాంగుడైన బిచ్చగాడు ఎలా ఛేదించాడన్నది కథ. దీనికి అవార్డు వచ్చింది. ఈ స్ఫూర్తితోనే బిగ్ స్క్రీన్‌కు షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యూ. అందుకు అవ్మూనాన్నల ప్రోత్సాహం కూడా ఉండటం వురింత బలాన్నిచ్చింది.

 - వాంకె శ్రీనివాస్

 ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. వినూత్నంగా...  విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top