ఎన్‌ఎస్‌ఎల్ నిధులు వివాదాస్పదం | NSL funds Controversy | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఎల్ నిధులు వివాదాస్పదం

Jun 23 2015 4:01 AM | Updated on Sep 3 2017 4:11 AM

నిజాం షుగర్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షల నిధుల వ్యవహారం చక్కెర పరిశ్రమల విభాగంలో వివాదాలకు దారి తీస్తోంది.

చక్కెర పరిశ్రమ విభాగంలో రూ.20 లక్షలపై రచ్చ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షల నిధుల వ్యవహారం చక్కెర పరిశ్రమల విభాగంలో వివాదాలకు దారి తీస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లా హిందూపూర్‌లోని నిజాం షుగర్స్‌ను ప్రైవేటు పరం చేశారు. ఈ సందర్భంగా జరిగిన లావాదేవీల్లో బకాయి రూపంలో సీడీసీకి (చెరుకు పరిశ్రమాభివృద్ధి సంస్థ) రావాల్సిన రూ.20 లక్షలను సదరు ప్రైవేటు సంస్థ చెల్లించింది.

చాలాకాలంగా చిత్తూరు చెరుకు సహాయ కమిషనర్ ఖాతాలో వున్న ఈ సొమ్మును రాష్ట్ర పునర్విభజన సమయంలో చక్కెర పరిశ్రమల విభాగం కమిషనరేట్ ఖాతాలో జమ చేశారు. ఈ నిధుల్లో నుంచి ఓ అధికారి వాహనం కొనుగోలుకు ప్రతిపాదిం చారు. చక్కెర పరిశ్రమల విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉన్నతాధికారి ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం.  

ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తుల అమ్మకానికి సంబంధించిన నిధులు కాబట్టి, ఏపీకి చెందుతాయంటూ ఆ ఉన్నతాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిజాం షుగర్స్‌కు అప్పులు, ఆస్తులు తెలంగాణకే చెందుతున్నందున రూ.20 లక్షలపై ఎలాం టి వివాదం లేదని మరో అధికారి వాదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement