జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు వర్సిటీలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు.
హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు వర్సిటీలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. బుధవారం ఆయన హైదరాబాద్ రానున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు’లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన తర్వాత నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో సభ జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అనుమతించకున్నా సభ జరిపి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.