నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్పై వేటు | nikhil reddy case: doctor chandrabhushan licence cancelled for 2 years | Sakshi
Sakshi News home page

నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్పై వేటు

Nov 4 2016 7:04 PM | Updated on Sep 4 2017 7:11 PM

నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్పై వేటు

నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్పై వేటు

సంచలనం కలిగించిన నిఖిల్ రెడ్డి ఆపరేషన్ కేసులో డాక్టర్పై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్: సంచలనం కలిగించిన నిఖిల్ రెడ్డి ఆపరేషన్ కేసులో డాక్టర్పై చర్యలు తీసుకున్నారు. ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డికి అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ లైసెన్స్ను రెండేళ్ల పాటు రద్దు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దాదాపు ఆరు నెలల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి ఎత్తు పెరిగేందుకు సర్జరీ చేయించుకున్నాడు. కాగా సర్జరీ విజయవంతం కాకపోగా, ఆ తర్వాత నిఖిల్ రెడ్డి నడవలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. వైద్యుల నిర్వాకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, అతనికి పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిఖిల్ రెడ్డి కుటుంబసభ్యులు హెచ్ఆర్సీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు.

ఆరు కేసుల్లో డాక్టర్లపై వేటు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఆరు వేర్వేరు కేసుల్లో డాక్టర్లపై వేటు వేసింది. కూకట్పల్లి సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రత లైసెన్స్ను ఐదేళ్లు రద్దు చేస్తూ, జీవితాంతం సరోగసీ వైద్యం చేయరాదని ఆదేశించింది. మరో మూడు కేసుల్లో డాక్టర్లు రాహుల్, మినహాజ్ జాఫర్,హరికుమార్ లైసెన్స్లను ఆరు నెలల చొప్పున సస్పెండ్ చేసింది. మరో కేసులో జగిత్యాల జిల్లా కత్లాపూర్కు చెందిన డాక్టర్ మనోజ్  కుమార్ లైసెన్స్ను మూడు నెలలు రద్దు చేసింది. మరో ముగ్గురు డాక్టర్లు కృష్ణకాంత్ రెడ్డి, కే స్వామి, రాజేష్లపైనా చర్యలు తీసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement