‘నర్రా’ స్ఫూర్తిగా హక్కుల సాధనకు పోరు | narra ragravareddy memorial meeting | Sakshi
Sakshi News home page

‘నర్రా’ స్ఫూర్తిగా హక్కుల సాధనకు పోరు

Apr 30 2015 1:48 AM | Updated on Sep 3 2017 1:07 AM

నర్రా రాఘవరెడ్డి సంతాప సభలో మాట్లాడుతున్న సున్నం రాజయ్య

నర్రా రాఘవరెడ్డి సంతాప సభలో మాట్లాడుతున్న సున్నం రాజయ్య

ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి స్ఫూర్తిగా హక్కుల సాధనకోసం పోరాటం చేయాలని సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య అన్నారు.

- రాఘవరెడ్డి సంతాప సభలో సున్నం రాజయ్య

హైదరాబాద్:
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి స్ఫూర్తిగా హక్కుల సాధనకోసం పోరాటం చేయాలని సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. బుధవారమిక్కడ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో  రాఘవ రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తొలిసారిగా గ్రామ సేవకుల సంఘాన్ని ఏర్పాటు చేసింది రాఘవ రెడ్డి అని, వారి వేతనాల పెంపుకోసం ఆయన  కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర నాయకుడు వంగూరి రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, రాష్ట్ర నేతలు పాలడుగు భాస్కర్, ఎస్.రమా, రైతు సంఘం నేతలు బొంతల చంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరబండి ప్రసాదరావు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement