టాలీవుడ్ హీరో అరెస్ట్ | Nanduri uday kiran arrested By jubilee hills police | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ హీరో అరెస్ట్

Apr 18 2015 5:01 PM | Updated on Aug 28 2018 4:30 PM

టాలీవుడ్ హీరో అరెస్ట్ - Sakshi

టాలీవుడ్ హీరో అరెస్ట్

అకారణంగా యువకుడిపై దాడి చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించిన టాలీవుడ్ సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్ ని జూబ్లీహిల్స్ పోలీసులు ఆరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : అకారణంగా యువకుడిపై దాడి చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించిన సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్ అలియాస్ స్కాం బాబీ (పరారే,ఫేస్‌లుక్ చిత్రాల హీరో)ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కథనం ప్రకారం... ఎస్‌ఆర్‌నగర్‌లోని బీకే గూడలో నివాసం ఉండే జాతీయ బ్యాడ్మింటన్ క్రీఢాకారుడు ఎంవీఎస్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈ నెల 16న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని ఎయిర్ పబ్‌కు వచ్చాడు.

లిఫ్ట్ ఎక్కడానికి వేచిఉండగా లోపలినుంచి మద్యం సేవించి వచ్చిన హీరో ఉదయ్‌కిరణ్ లిఫ్ట్ దిగి బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న ప్రవీణ్‌ను చూడగానే ఉదయ్ బూతులు తిడుతూ కోపంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఇటీవల రెండుసార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న విషయాన్ని పోలీసులకు చెప్పావంటూ ప్రవీణ్‌పై ఉదయ్ కిరణ్ దాడి చేశాడు.

పిడిగుద్దులు గుద్దుతూ... కాలితో తన్నుతూ... చంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా ప్రవీణ్ తల్లిని చెల్లిని కూడా అంతం చేస్తానంటూ హెచ్చరించాడు. ఇద్దరి మద్య గొడవ తారాస్థాయికి చేరింది.  దాంతో బాధితుడి ఫిర్యాదుతో నిందితుడు ఉదయ్‌కిరణ్‌పై ఐపీసీ 506,509,323ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం ఉదయ్కిరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement