భిక్షాటనతో ఎమ్మార్పీఎస్ నిరసన | mrps new way of protest in hyderabad | Sakshi
Sakshi News home page

భిక్షాటనతో ఎమ్మార్పీఎస్ నిరసన

Aug 3 2016 2:34 PM | Updated on Sep 4 2017 7:40 AM

వర్గీకరణ బిల్లును కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.

హైదరాబాద్‌సిటీ: పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని రామ్‌నగర్ వద్ద భిక్షాటన చేశారు. ఈ సమావేశాల్లోనైనా బిల్లు ప్రవేశపెట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ డిల్లీలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు మద్ధతుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ భిక్షాటన చేశారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement