మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ | most wanted criminal murugan arrested in hyderabad | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

Dec 22 2015 3:17 PM | Updated on Mar 28 2018 11:26 AM

వరుస బ్యాంక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: వరుస బ్యాంక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల ముఠాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, తమిళనాడుకు చెందిన మురుగున్ ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రూ.1.7 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఘట్ కేసర్ గ్రామీణ బ్యాంకుల్లో ఈ ముఠా చోరీకి పాల్పడిందన్నారు. వరదయ్యపాలెం, ఇబ్రహీంపట్నం బ్యాంకుల్లో కూడా నిందితులు చోరీకి పాల్పడి ఉండొచ్చునని వారు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయినట్లు వివరించారు. నిందితులను విచారణ చేస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement