తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేఖ రాశారు. మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వద్ద డిసెంబర్ 23 నుండి ఐదురోజుల పాటు అయుత చండీయాగాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల కేసీఆర్కు మోదీ అభినందనలు తెలిపారు. లోక కళ్యాణం, విశ్వశాంతిని కోరుతూ చేపట్టిన ఈ యాగం మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మోదీ లేఖలో పేర్కొన్నారు.