వైద్య విద్యార్థిని ఆత్మహత్య | Medical student commits suicide | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Dec 1 2015 1:46 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఉప్పల్‌ పరిధిలోని మేడిపల్లి పీ అండ్ టీ కాలనీలో నివాసముంటున్న భవాని(22) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉప్పల్‌ పరిధిలోని మేడిపల్లి పీ అండ్ టీ కాలనీలో నివాసముంటున్న భవాని(22) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది .. రాత్రి అందరూ నిద్రపోతున్న సమంయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

వరంగల్ జిల్లాకు చెందిన భవాని అదే జిల్లాకు చెందిన దోమల పృద్వీరాజుతో 2014లో వివాహం జరిగింది. భవాని నగరంలోని ఓ వైద్య కళాశాలలో విద్యార్థిని.  కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement