రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్ భరో: మల్లు రవి | mallu ravi fired on bjp leaders | Sakshi
Sakshi News home page

రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్ భరో: మల్లు రవి

Jul 21 2016 4:08 AM | Updated on Sep 4 2017 5:29 AM

రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్ భరో: మల్లు రవి

రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్ భరో: మల్లు రవి

చరిత్ర ఆధారంగానే రాహుల్ గాంధీ మాట్లాడారని, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

 సాక్షి, హైదరాబాద్: చరిత్ర ఆధారంగానే రాహుల్ గాంధీ మాట్లాడారని, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీని అరెస్టు చేసి జైల్లో పెడితే దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఉన్నప్పుడు కొంతకాలం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది వాస్తవం కాదా?, గాడ్సేకు గుడి కట్టాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన విజ్ఞప్తి నిజం కాదా అని మల్లు రవి ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement