పాలన గాడి తప్పింది: మల్లు రవి | Mallu Ravi comments on TRS government | Sakshi
Sakshi News home page

పాలన గాడి తప్పింది: మల్లు రవి

May 17 2017 3:51 AM | Updated on Sep 5 2017 11:18 AM

రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన గాడి తప్పిందని, ప్రభుత్వమే ప్రజల మధ్య కొట్లాటలను పెట్టి హింసను ప్రోత్సహిస్తున్నదని

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన గాడి తప్పిందని, ప్రభుత్వమే ప్రజల మధ్య కొట్లాటలను పెట్టి హింసను ప్రోత్సహిస్తున్నదని టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి, మాజీమంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ రెండు వర్గాలకు ఒకేసారి ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ దగ్గర ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ధర్నాచౌక్‌ తరలింపుపై ప్రజాందోళనలకు భయపడిన ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ కొత్త కుట్రలకు తెరలేపాయన్నారు.

ఇందిరాపార్కు ప్రాంతంతో సంబంధంలేని ఎల్‌బీ నగర్, ఉప్పల్‌ ప్రాంతాల టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా పేరిట ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు తెగబడ్డారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ధర్నాచౌక్‌ వద్ద ప్రతిపక్షాలు, జేఏసీ ఆందోళన చేస్తుంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు దాడులు చేశారని మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement