సిఎం అఖిలేష్తో భేటీ కానున్న కేటీఆర్ | KTR meet with CM Akhilesh | Sakshi
Sakshi News home page

సిఎం అఖిలేష్తో భేటీ కానున్న కేటీఆర్

Oct 15 2015 9:17 AM | Updated on Sep 3 2017 11:01 AM

తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందం గురువారం ఉదయం లక్నో బయలుదేరి వెళ్లారు.

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందం గురువారం ఉదయం లక్నో బయలుదేరి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో కేటీఆర్ బృందం భేటీ కానున్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై యూపీ సిఎం ఆసక్తి కనిబరిచారు. దీంతో అఖిలేష్ ఆహ్వానం మేరకు ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ బృందం ఆయనకు తెలియజేయనున్నారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. కేటీఆర్తో పాటు అధికారులు రేమండ్ పీటర్, సురేందర్ రెడ్డి లక్నో వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement