'ఆయన అహంకారం వల్లే..' | kotamreddy sridharreddy criticised chandra babu | Sakshi
Sakshi News home page

'ఆయన అహంకారం వల్లే..'

Mar 17 2016 12:31 PM | Updated on Aug 31 2018 8:24 PM

'ఆయన అహంకారం వల్లే..' - Sakshi

'ఆయన అహంకారం వల్లే..'

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బేషజాలకు పోకుండా రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టను కాపాడాలని హితవు పలికారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అహంకార వైఖరి వల్లే ప్రతిపక్ష నేతలకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.

అన్ని తనకు తెలుసునన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు సలహాలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. యనమల లాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులను పట్టించుకోవద్దని సూచించారు. నేడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతనైనా టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోటంరెడ్డి శ్రీదర్రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement