ఇందిరాపార్క్ వద్ద రేపు ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు.
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం.