శంషాబాద్లో కేజీ బంగారం పట్టివేత | KG gold seized by customs officials at Samshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో కేజీ బంగారం పట్టివేత

Mar 19 2016 9:01 AM | Updated on Sep 3 2017 8:08 PM

శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం దుబాయి విమానంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇందులో భాగంగా దుబాయి నుంచి ఓ ప్రయాణికుడిని తనిఖీలు చేయగా ఒక కేజీ వరకు బంగారం దొరికినట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారు తెచ్చిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి రాజమండ్రికి చెందినవాడిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement