మేడారం జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్‌ | KCR praises Medaram jatara successfully end | Sakshi
Sakshi News home page

మేడారం జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్‌

Feb 20 2016 7:19 PM | Updated on Aug 15 2018 9:30 PM

మేడారం జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్‌ - Sakshi

మేడారం జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్‌

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మలను వనప్రవేశానికి పూజారులు తీసుకవెళ్లడంతో మేడారం జాతర ముగిసినట్టు శనివారం అధికారులు ప్రకటించారు.

ఈ జాతర నేపథ్యంలో రేయింబవళ్లు పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జాతర అద్భుతంగా జరిగిందని కొనియాడారు. వరంగల్‌ కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement