డిమాండ్లకు ఓకే అంటే.. పేరు మారుస్తా | Kancha ailayya comments on Samajika smglarlu komatollu book name issue | Sakshi
Sakshi News home page

డిమాండ్లకు ఓకే అంటే.. పేరు మారుస్తా

Sep 16 2017 1:03 AM | Updated on Aug 13 2018 8:12 PM

డిమాండ్లకు ఓకే అంటే.. పేరు మారుస్తా - Sakshi

డిమాండ్లకు ఓకే అంటే.. పేరు మారుస్తా

ఆర్యవైశ్యులకు కొన్ని డిమాండ్లను పెడుతున్నానని, వాటికి ఒప్పుకుంటే ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పేరును

‘సామాజిక సర్వర్లు వైశ్యులు’గా మారుస్తానన్న కంచ ఐలయ్య
 
హైదరాబాద్‌: ఆర్యవైశ్యులకు కొన్ని డిమాండ్లను పెడుతున్నానని, వాటికి ఒప్పుకుంటే ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పేరును ‘సామాజిక సర్వర్లు వైశ్యులు’గా మారుస్తానని ప్రొఫెసర్, రచయిత కంచ ఐలయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావుతో కలసి విలేకర్లతో మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల్లో టీజీ వెంకటేశ్, జీఎంఆర్, లలిత జువెలర్స్‌లతో పాటు అదాని, అంబాని, కిర్లోస్కర్, గోయెంకా తదితరులంతా వైశ్యులేనని, 46 శాతం దేశ ఆస్తి వైశ్య కమ్యూనిటీ చేతుల్లోనే ఉందన్నారు. వీరు బీజేపీకి ఇచ్చే డొనేషన్లలో 5శాతం పక్కన పెట్టి.. సోషల్‌ సెక్యూరిటీ ఫండ్‌ను ఏర్పాటుచేసి దళిత, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని తెలిపారు. ఆర్యవైశ్య బడా కంపెనీల్లో 5 శాతం ఉద్యోగాలు ఆదివాసీలు, దళితులు, చాకలి, మంగలి వంటి 4 కులాల వారికి ఇస్తే పుస్తకాన్ని విత్‌ డ్రా చేసుకుంటానని స్పష్టం చేశారు.

అలాగే ఈ డిమాండ్‌లకు ఒప్పుకుంటే పుస్తకం పేరును ‘సామాజిక సర్వర్లు వైశ్యులు’అని మారుస్తానని ప్రకటించారు. తనను దేశద్రోహిగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపినా, అకాల మరణం వచ్చినా దానికి ఆర్యవైశ్యులే కారణమన్నారు. ఆర్యవైశ్య సత్రాల్లోకి అందరినీ అనుమతించాలని, లేకుంటే ప్రతి కులానికి సత్రం కట్టించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, మధు, సీపీఐ నేతలు రామకృష్ణ, చాడ వెంకట్‌రెడ్డిలతో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement