చర్చకు భయపడిన జూపల్లి పెద్దోడా? | Juppally big for fear of debate? | Sakshi
Sakshi News home page

చర్చకు భయపడిన జూపల్లి పెద్దోడా?

Aug 24 2017 4:16 AM | Updated on Mar 22 2019 2:59 PM

చర్చకు భయపడిన జూపల్లి పెద్దోడా? - Sakshi

చర్చకు భయపడిన జూపల్లి పెద్దోడా?

పాలమూరు ప్రజలకు ద్రోహం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు రావాలంటే భయపడుతున్నారని, అలాంటి జూపల్లి పెద్దోడెలా అవుతాడని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు.

ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌:  పాలమూరు ప్రజలకు ద్రోహం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు రావాలంటే భయపడుతున్నారని, అలాంటి జూపల్లి పెద్దోడెలా అవుతాడని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టు ఆయకట్టును తగ్గిస్తూ జీవో వచ్చిందని, దానిని నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు, పచ్చి అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారని విమర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి జరిగిన నష్టం గురించి ప్రశ్నిస్తున్నానని, పదవుల కోసం ప్రజలకు నష్టం చేసే మంత్రి జూపల్లిని చెంచా అని, తొత్తు అని అనకుండా ఇంకా ఏమంటారో చెప్పాలని వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని వదిలిపెట్టేది లేదని, అసెంబ్లీలోనే నిలదీస్తానని వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement