అఖిలపక్షమంటూ ఏకపక్షమా..?: జూలకంటి | Julakanti fires on kcr | Sakshi
Sakshi News home page

అఖిలపక్షమంటూ ఏకపక్షమా..?: జూలకంటి

Oct 4 2016 3:14 AM | Updated on Aug 15 2018 9:35 PM

అఖిలపక్షమంటూ ఏకపక్షమా..?: జూలకంటి - Sakshi

అఖిలపక్షమంటూ ఏకపక్షమా..?: జూలకంటి

అఖిలపక్షాన్ని సంప్రదించకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్షంగా కొత్త జిల్లా లు ఏర్పాటు చేయడం సరికాదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: అఖిలపక్షాన్ని సంప్రదించకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్షంగా కొత్త జిల్లా లు ఏర్పాటు చేయడం సరికాదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటు జరగదంటూనే పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని సోమవారం ఓ ప్రకటనలో తప్పుబట్టారు.

జిల్లాలపై ప్రజలు గట్టిగా కోరుతున్న చోట, ఆందోళనలు చేస్తున్న చోట ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నా రు. అఖిలపక్ష భేటీలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మరోసారి భేటీ నిర్వహించి చర్చించాకే జిల్లాలపై తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement