ప్రముఖ నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు | IT raids on producer korrapati sai office in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు

Sep 21 2016 7:39 PM | Updated on Sep 27 2018 3:37 PM

ప్రముఖ నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు - Sakshi

ప్రముఖ నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు

ప్రముఖ సినీ నిర్మాత కొర్రపాటి సాయి కార్యాలయంపై బుధవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత కొర్రపాటి సాయి కార్యాలయంపై బుధవారం ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో తొమ్మిది చోట్ల దాడులు చేశారు.  ఈ సందర్భంగా హైదరాబాద్ లోని  ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను  ఐటీశాఖ అధికారులు తనిఖీ చేసినట్లు సమాచారం. కాగా నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ’ జ్యో అచ్యుతానంద’ చిత్రాన్ని కొర్రపాటి సాయి నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కాగా  వారాహి చలన చిత్రం బ్యానర్పై కొర్రపాటి సాయి 'ఈగ', 'అందాల రాక్షసి', 'లెజెండ్', 'ఉహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా', 'తుంగభద్ర' వంటి హిట్ చిత్రాలను అందించారు. ఇక ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement