హైదరాబాద్ నూ తాకిన ‘హోదా’ సెగ | it employees protest for ap special status in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నూ తాకిన ‘హోదా’ సెగ

Jan 26 2017 12:04 PM | Updated on Mar 23 2019 9:10 PM

హైదరాబాద్ నూ తాకిన ‘హోదా’ సెగ - Sakshi

హైదరాబాద్ నూ తాకిన ‘హోదా’ సెగ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనూ ఏపీ ప్రత్యేక హోదా నినాదం మార్మోగింది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనూ ఏపీ ప్రత్యేక హోదా నినాదం మార్మోగింది. ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా కేబీఆర్ పార్కు వద్ద ఐటీ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ‘వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్’ అంటూ నినదించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధిస్తుందని, పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. స్పెషల్ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని టీఆర్ఎస్ ఎంపీ కవిత సమర్థించారు. కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement