రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: పొన్నం | Injustice to Telangana in the railway budget :Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: పొన్నం

Feb 25 2016 5:01 PM | Updated on Mar 29 2019 9:31 PM

రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు.

హైదరాబాద్‌: రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ  రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. 

ముఖ్య మంత్రి ఫాం హౌస్ కే పరిమితయ్యారని పొన్నం ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని పొన్నం విమర్శించారు. నిధులు రాకపోవడానికి బీజేపీ, టీఆర్ఎస్ లే కారణమన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో సహాయ నిరాకరణ చేయాలని, లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement